CEC ని తొలగించాల్సిందే..ఆయన బీజేపీకి తొత్తులా పనిచేస్తున్నడు : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌

CEC ని తొలగించాల్సిందే..ఆయన బీజేపీకి తొత్తులా పనిచేస్తున్నడు : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌
  •     అరెస్ట్‌‌‌‌ చేసి జైలుకు పంపాలి
  •     పది సార్లు ఓట్లు వేసినవారి పేర్లు తొలగించడమేంటి?
  •     దానం అనర్హతకు, మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు నో లింక్‌‌‌‌ 
  •     పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ ‌‌గౌడ్‌‌‌‌ 

నిజామాబాద్‌‌‌‌, వెలుగు: ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తూ బీజేపీకి తొత్తుగా పని చేస్తున్న చీఫ్‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ను‌‌ అభిశంసనతో పదవి నుంచి తొలగించాల్సిందేనని పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. ఇద్దరు కమిషనర్లను కాదని ఒంటెత్తుపోకడతో నియంతలా ప్రవర్తిస్తున్న ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. శుక్రవారం నిజామాబాద్‌‌‌‌లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సీఈసీని అభిశంసనతో పదవీచ్యుతుడిని చేయాలనే లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌గాంధీ, ఎంపీ ప్రియాంకగాంధీ ఆలోచన వంద శాతం సరైనదన్నారు. స్వతంత్రంగా పని చేయాల్సిన ఎన్నికల వ్యవస్థను బీజేపీకి దాసోహం చేశారని ఆరోపించారు. దేశంలో పుట్టిపెరిగి, ఇప్పటిదాకా పదిసార్లకు మించి ఓట్లేసిన పౌరుల పేర్లను కూడా తొలగించి వారికి నోటీస్‌‌‌‌లు ఇస్తూ ఇబ్బందిపెడుతున్నారని ధ్వజమెత్తారు. 

కమలం గుర్తుకు పడని ఓట్లను తొలగించాలనే బీజేపీ కుట్రను సర్‌‌‌‌ పేరుతో అమలు చేస్తూ తీరని ద్రోహం చేస్తున్నారని.. ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. తోటి కమిషనర్‌‌‌‌ల నుంచే ఆరోపణల ఎదుర్కొంటున్న ఆయన.. నైతిక విలువలు ఉంటే తక్షణమే తప్పుకోవాలన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్‌‌‌‌తో పాటు జిల్లా కేంద్రాల్లో సీఈసీకి వ్యతిరేకంగా నిరసన చేపడతామన్నారు. ఖైరతాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌ అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని మహేశ్ ‌‌గౌడ్‌‌‌‌ తెలిపారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌‌‌‌ వచ్చాక అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. 

కాంగ్రెస్‌‌ సర్కార్‌‌‌‌‌‌కు మద్ధతు పలుకుతున్న మరో 8 మంది బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేల విషయానికి, దానం అనర్హతకు సంబంధం లేదని.. అవి పూర్తిగా వేర్వేరు అంశాలన్నారు. కాగా, పీసీసీ చీఫ్‌‌‌‌గా రెండేండ్లు పూర్తి చేసుకున్న మహేశ్‌‌ గౌడ్‌‌‌‌ తరపున నగరంలోని బాపూజీ వచనాలయానికి కాంగ్రెస్‌‌‌‌ నేత రత్నాకర్ కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా  మహేశ్‌‌ ‌‌గౌడ్‌‌‌‌ మాట్లాడుతూ.. పుస్తక పఠనంతో విజ్ఞానం, వికాసం కలుగుతుందని, యువత నిత్యజీవితంలో దీనిని భాగం చేసుకొని ఎదగాలన్నారు. టెక్నాలజీని యూత్‌‌‌‌ తమ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని, దుర్వినియోగం చేయొద్దన్నారు. కార్యక్రమంలో మేయర్‌‌‌‌ ఉమారాణి, డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌ నగేశ్‌‌ రెడ్డి, బాపూజీ వచనాలయం ప్రెసిడెంట్‌‌‌‌ భక్తవత్సలంనాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు దుబ్బ ఏరియాలో సార్వజనిక్‌‌‌‌ గణేశ్‌‌ నిమజ్జన శోభాయాత్రను మహేశ్ ‌‌గౌడ్‌‌‌‌ పూజ చేసి ప్రారంభించారు.