V6 News

రాహుల్ నేతృత్వంలోరాజ్యాంగాన్ని కాపాడుకున్నాం: ఎంపీ వంశీకృష్ణ

రాహుల్ నేతృత్వంలోరాజ్యాంగాన్ని కాపాడుకున్నాం: ఎంపీ వంశీకృష్ణ

లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ స్పందించారు. రాహుల్ నేతృత్వంలో ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకున్నామని చెప్పారు.  మహిళా కోటాకు డీలిమిటేషన్ బిల్లుకు లింక్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.  డీలిమిటేషన్ లిటిగేషన్ లేకుండా మహిళా కోటా బిల్ తెస్తే కాంగ్రెస్  మద్దతిస్తుందని చెప్పారు.  మహిళా బిల్లు 2023లోనే పాసైందని..ఆ బిల్లును అమలు చేయాలన్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం బిల్లు తీసుకురావడం సరికాదన్నారు వంశీకృష్ణ.

వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ  బిల్లు

లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. లోక్ సభలో  528మంది ఎంపీల ఓట్లకు గానూ అనుకూలంగా 298 ఓట్లు .. వ్యతిరేకంగా 230ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు మూడింట రెండో వంతు మెజార్టీ ఉండాలి. అంటే అనుకూలంగా 358ఓట్లు రావాల్సి ఉండగా.. కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు 54 ఓట్లు తగ్గాయి. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింక్ ఉన్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా కోటాకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడంతో విపక్షాలు పూర్తిగా వ్యతిరేకించారు. 

డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్లను బీజేపీ పరిగణలోకి తీసుకోకుండా 131 రాజ్యాంగ సవరణ బిల్లు మద్దతు కోసం సభలో ఓటింగ్ కు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అయితే మ్యాజిక్ ఫిగర్  ఓట్లు రాకపోవడంతో బిల్లు వీగిపోయింది.