కాలి నడకన తిరుమల శ్రీవారి దర్శనానికి పవన్ సతీమణి

కాలి నడకన తిరుమల శ్రీవారి దర్శనానికి పవన్ సతీమణి

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్లి డిప్యూటీ సీఎం సతీమణి మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన భార్య లెజ్నోవా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.

శనివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో కుటుంబ సభ్యులతో కలిసి హరీష్ రావు తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలసి హరీష్ రావు దర్శించుకోనున్నారు.