తిరుపతి: ‘ఊరు వాడ’ పేరుతో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రానున్న కాలంలో సుమారు రూ.100 కోట్ల సేవా యజ్ఞం తలపెట్టామని.. ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ తిరుపతి తాజ్ హోటల్లో ఉంటుందని RAW NTR సంస్థ మరోసారి స్పష్టం చేసింది. అయితే.. తాజ్ హోటల్కు భద్రత కల్పించాలని తిరుపతి రూరల్ పోలీసులను సదరు హోటల్ యాజమాన్యం ఆశ్రయించింది.
రేపు (జులై 18, 2026) ఉదయం తాజ్ హోటల్లో RAW NTR అసోసియేషన్ ప్రెస్ మీట్ ఉన్న క్రమంలో.. Raw NTR అసోసియేషన్కు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. హోటల్పై అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలంటూ తిరుపతి రూరల్ పోలీసులకు తాజ్ హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య చారి స్పష్టం చేశారు.
జూ.ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన..
— Telugu Feed (@Telugufeedsite) July 14, 2026
ఈనెల 18న కార్యక్రమంపై స్పందించిన #JrNTR ఆఫీస్
RAW NTR సంస్థ కార్యకలాపాలతో సంబంధం లేదు.. RAW NTR సంస్థతో తమకెలాంటి సంబంధంలేదని ఎన్టీఆర్ ఆఫీస్ ప్రకటన
తెర వెనుక బుజ్జగింపులు జరిగి ఉంటాయా..? అని అనుమానిస్తున్న రాజకీయ విశ్లేషకులు pic.twitter.com/5Vw0nXuVUn
RAW NTR పేరుతో సోషల్ మీడియాలో జోరుగు ప్రచారాని, హీరో జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ అభిమానులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఊరు వాడ పేరుతో 100 కోట్ల అభివృద్ధి పనులంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. అభిమానులు ఎవరూ తిరుపతికి వెళ్లొద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అభిమానులకు సూచించింది.
Also Read : సైకో క్రైమ్ థ్రిల్లర్ 'వదలా'..
అయితే.. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఆపేది లేదని.. ‘ఊరు వాడ’పై తిరుపతి తాజ్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించి తీరతామని, తమ సొంత డబ్బులతో సేవ చేస్తుంటే వివాదం సృష్టిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్పై RAW NTR ఫౌండర్ సాయి రూప్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల మధ్య నెలకొన్న వివాదం తిరుపతిలో శనివారం ఎటు వైపుకు దారితీస్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
