Sreeleela: ఇప్పుడే 'కల్యాణ ప్రాప్తిరస్తు' ఏంటండీ బాబూ.. పూజారి దీవెనలకు శ్రీలీల షాక్!

Sreeleela: ఇప్పుడే 'కల్యాణ ప్రాప్తిరస్తు' ఏంటండీ బాబూ.. పూజారి దీవెనలకు శ్రీలీల షాక్!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల ఎక్కడ ఉంటే అక్కడ సందడి మాములుగా ఉండదు. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లోని కెపీహెచ్బీలో ఒక షాపింగ్ మాల్ ఈవెంట్ కు హాజరైంది. తన బ్యూటీఫుల్ ప్రెజెన్స్ తో అందరికి ఆకట్టుకుంది. అయితే ఈ ఓపెనింగ్ పూజా కార్యక్రమాల్లో జరిగిన ఓ సరదా ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. శ్రీలీల ఫోటోలు , క్యూట్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇప్పుడే పెళ్లేంటండీ !

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముందు వేద మంత్రాలతో పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  సంప్రదాయ దుస్తుల్లో శ్రీలీల ఎంతో భక్తిశ్రద్ధలతో చేతులు జోడించి నిలబడింది. సరిగ్గా పూజ పూర్తయ్యాక, పంతులు గారు అక్షింతలు వేసి దీవిస్తూ....'కల్యాణ ప్రాప్తిరస్తు' అని ఆశీర్వచనం పలికారు. ఆ మాట వినగానే అమ్మడు ఒక్కసారిగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో షాక్ అయింది.

Also Read : ఆస్తి కోసం పెళ్లి.. శోభనం రాత్రి మిస్టరీ..

వెంటనే స్పందిస్తూ.. 'ఇప్పుడే కల్యాణ ప్రాప్తిరస్తు ఏంటండీ.. ఇంకా కెరీర్‌లో ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉంది.. పంతులు గారు, ప్లీజ్ ఆ మాటలు వెనక్కి తీసుకోండి! అంటూ ముద్దుముద్దుగా రిక్వెస్ట్ చేసింది. దానికి ఆ పూజారి కూడా అంతే స్మార్ట్‌గా స్పందిస్తూ.. 'నీ కెరీర్ తర్వాతే పెళ్లి లెండి!' అని చమత్కరించడంతో అక్కడ నవ్వుల పూలు పూశాయి. ఈ మొత్తం సంభాషణ అక్కడే ఉన్న అభిమానుల కెమెరాల్లో బంధించబడగా, వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది..  శ్రీలీల ఇచ్చిన ఈ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అమాయకమైన స్పందన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 

కెరీర్ గ్రాఫ్.. కొత్త ఆశలు
శ్రీలీల తన వైద్య విద్యను పూర్తి చేయడానికి కాస్త బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. అటు అఖిల్'లెనిన్'  సినిమా లో శ్రీలీల ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. లేటెస్ట్ గా కోలీవుడ్‌లో అజిత్ - అధిక్ రవిచంద్రన్ సినిమాలోనూ శ్రీలీల స్థానంలో కాయాదు లోహర్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.  

ప్రస్తుతం తమిళ్ లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'OM 'తో పాటు బాలీవుడ్ లో ఒక మూవీలో కూడా నటించేందుకు సిద్దమవుతోంది. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా..అభిమానులతో కలిసిపోయే తీరు, సహజమైన హావభావాలతో శ్రీలీల మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది..