సోషల్ డిస్టెన్స్ గాలికొదిలేసిన ప్రజలు

సోషల్ డిస్టెన్స్ గాలికొదిలేసిన ప్రజలు

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే సోషల్ డిస్టెన్స్ మాత్రమే మార్గమని ప్రభుత్వాలు, అధికారులు మొత్తుకుంటున్నారు. అయినా నిత్యావసర వస్తువుల పంపిణీల్లో మాత్రం ప్రజలు సోషల్ డిస్టెన్స్ అసలు పాటించడంలేదు. నిర్వాహకులు ఎంత కట్టడి చేసినా జనాలు మాత్రం డిస్టెన్స్ పాటించకుండా పోటీ పడుతున్నారు. కరోన మహమ్మారి వలన ఇబ్బందులు పడుతున్న పేదలకు మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో మల్కాజిగిరి అనుటెక్స్ చౌరస్తా వద్ద నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆ వస్తువులు తీసుకోవడానికి వచ్చిన వారు మాత్రం ఎటువంటి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా.. ఒకరిపై ఒకరు ఎగబడ్డారు. సోషల్ డిస్టెన్స్ పాటించమని రాష్ట్ర ప్రభుత్వం మరియు మీడియా ఎంత మొత్తుకున్నా వినడం లేదు. సోషల్ డిస్టెన్స్ గురించి మైనంపల్లి సేవా సమితి నిర్వాహకులు రోహిత్ ను అడుగగా.. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎంతచెప్పినా సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని.. అందువల్ల రేపటి నుంచి పంపిణీ కార్యక్రమాన్ని అధికారుల సమక్షంలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి మల్కాజిగిరి నియోజకవర్గంలో నిత్యం సుమారు 5 వందల మందికి నిత్యావసర వస్తువులు, మాస్క్లులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నట్లు మైనంపల్లి సేవా సమితి నిర్వాహకుడు రోహిత్ తెలిపారు.

For More News..

ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 5000 ఆర్థికసాయం

కరోనా మృతుల్లో అగ్రరాజ్యానికే అగ్రభాగం

24 గంటల్లో 34 మరణాలు, 909 కొత్త కేసులు

ఎన్ని కణాలుంటే వైరస్ సోకుతుందో తెలుసా..

లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..