- ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి
షాద్‌నగర్, వెలుగు: కొందుర్గ్ పోలీస్ స్టేషన్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో అందిస్తున్న సేవలు, ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానం, వివిధ కేసుల దర్యాప్తు పురోగతి, అమలు చర్యలపై ఆరా తీశారు.
అనంతరం పోలీసులకు పలు సూచనలు చేశారు. 100 కాల్స్‌కు వెంటనే స్పందించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టాలని సూచించారు. సీపీ వెంట డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ శ్రీనివాస్ ఉన్నారు.
