ఆడవాళ్లలో హార్మోనల్ ఇంబాలెన్స్ కు అవి కూడా ఒక కారణమే

ఆడవాళ్లలో హార్మోనల్ ఇంబాలెన్స్ కు అవి కూడా ఒక కారణమే

సువాసనలు వెదజల్లే పర్‌‌ఫ్యూమ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ఆడవాళ్లలో హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేందుకు పర్‌‌ఫ్యూమ్ వాడకం కూడా ఒక కారణమని స్టడీస్ చెప్తున్నాయి. పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) అనేది మహిళల్లో సాధారణంగా వచ్చే హార్మోన్ సమస్యల్లో ఒకటి. పది మంది స్త్రీలలో కనీసం ముగ్గురికి ఈ సమస్య ఉంటున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. అయితే పర్‌ఫ్యూమ్స్‌ ఎక్కువగా వాడడం వల్ల మహిళల్లో పీసీఓఎస్ సమస్య ఎక్కువ అవుతున్నట్టు స్టడీల్లో తేలింది.  పర్‌‌ఫ్యూమ్స్‌లో  ‘ట్రైక్లోసన్‌’ అనే  క్లోరినేటెడ్ ఫ్రాగ్రెన్స్ కాంపౌండ్ ఉంటుంది.

ఇది మహిళల్లో ఈస్ట్రోజెనిక్, ఆండ్రోజెనిక్, యాంటీఆండ్రోజెనిక్ యాక్టివిటీస్‌కు నష్టం కలిగించి, థైరాయిడ్ పనితీరుని దెబ్బ తీస్తుంది. ట్రైక్లోసన్‌తో ఉండే నష్టాన్ని గుర్తించి యునైటెడ్ స్టేట్స్ ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’.. స్నానానికి వాడే సబ్బుల్లో ట్రైక్లోసన్‌తో పాటు 18 ఇతర యాంటీమైక్రోబయల్ కెమికల్స్​ను వాడటాన్ని నిషేధించింది. అయితే మనదేశంలో ట్రైక్లోసన్- ఉత్పత్తుల వాడకంపై ఎలాంటి నియంత్రణ లేదు. కాబట్టి పర్‌‌ఫ్యూమ్స్ వాడే ముందు అందులో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలుసుకుని వాడడం మంచిది.