మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు..పోలీస్ కస్టడీకి పైలెట్ రోహిత్ రెడ్డి

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు..పోలీస్ కస్టడీకి పైలెట్ రోహిత్ రెడ్డి

 హైదరాబాద్ మొయినా బాద్ ఫార్మ్ హౌజ్ డ్రగ్స్ కేసులో విచారణను  స్పీడప్ చేశారు పోలీసులు .  ముగ్గురు నిందితులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత శర్మలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు . ఉప్పర్ పల్లి కోర్టు  ముగ్గురు నిందితులను మూడు రోజుల పోలీస్ కస్టడీకి  అనుమతించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం  ముగ్గురిని చంచల్ గూడ జైలు నుంచి శంషాబాద్ రూరల్ పీఎస్ కు తరలించారు. శంషాబాద్ రూరల్ పిఎస్ లో ముగ్గురు నిందితులను డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ విచారిస్తోంది.

 దుబాయి లింకులు , డ్రగ్స్ దందా , నిమిద్ శర్మ రియల్ వ్యాపారాలపై కూడా సిట్ విచారణ కొనసాగనుంది.నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి వ్యాపారాలపై సిట్‌‌‌‌‌‌‌‌ ఫోకస్ పెట్టనుంది. నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మ ఏ వ్యాపారాలు చేస్తారు, రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో కలిసి చేస్తున్న దందాలేంటి అన్న సమాచారం సేకరించనున్నారు. కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై, వీకెండ్ పార్టీలకు హాజరయ్యే హై ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ వ్యక్తులు, రోహిత్ రెడ్డి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌పై సిట్‌‌‌‌‌‌‌‌ దర్యాప్తు చేయనుంది. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను చేధించేందుకు నిందితుల కాల్‌‌‌‌‌‌‌‌ డేటాతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తారు.

మొయినాబాద్ అజీజ్ నగర్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మార్చి 14న రాత్రి ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోహిత్ రెడ్డి, ఏపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ సహా మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. పోలీసులపై కాల్పులకు యత్నించారని ఢిల్లీ రియల్టర్ నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి ఆర్మ్స్ యాక్ట్ కింద రిమాండ్ చేశారు.