సూర్యుడు అస్తమించకపోతే ఎలా ఉంటుంది?

సూర్యుడు అస్తమించకపోతే ఎలా ఉంటుంది?

సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తే రోజు పూర్తవుతుంది. రాత్రి, పగలు ఏర్పడడానికి కారణం కూడా ఇదే. కానీ, అసలు సూర్యుడు అస్తమించకపోతే ఎలా ఉంటుంది? అదెలా కుదురుతుంది? అనుకుంటున్నారా.. సూర్యుడు అస్తమించని ప్రదేశాలు ఈ భూమిపై చాలానే ఉన్నాయి. అందులో కొన్ని ఇవి.

నార్త్ స్వీడెన్‌‌‌‌లోని కిరునా నగరాన్ని చూడడానికి ప్రతి ఏటా వేల మంది టూరిస్టులు వస్తుంటారు. అది కూడా ఏడాదిలో వంద రోజులు మాత్రమే. ఎందుకుంటే ఆ వంద రోజులు అక్కడ సూర్యుడు అస్తమించడు కాబట్టి. ప్రతి ఏటా మే నెల నుంచి ఆగస్టు మధ్య దాదాపు వంద రోజులపాటు కిరునా నగరంలో సూర్యుడు అస్తమించకుండా ఒకేచోట ఉంటాడు.  అందుకే ఆ మూడు నెలలూ అక్కడ ఎంతో ప్రత్యేకం. కిరునా నగరం ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ ఎండాకాలం సీజన్‌‌‌‌లో పగలు, సాయంత్రాలు ఉండవు. 

నార్త్ గ్రీన్‌‌‌‌లాండ్‌‌‌‌లో ఉండే కానాక్ అనే నగరంలో కూడా పగలు సాయంత్రాలు ఉండవు. ఇక్కడ ఎండాకాలం అంతా సాయంత్రం లాగ ఉంటుంది.  చలికాలం మొత్తం రాత్రిలా ఉంటుంది.  అందుకే ఇక్కడ నివసించే వాళ్లు కిటికీలకు పరదాలు కట్టుకుని రాత్రిలా ఫీలవుతుంటారు.

కెనడాలోని యుకొన్‌‌‌‌ ప్రాంతంలో ఎండాకాలంలో  దాదాపు 50 రోజులపాటు సూర్యుడు అస్తమించకుండా  ప్రకాశిస్తాడు. అందుకే, ఈ ప్రాంతాన్ని అర్ధరాత్రి సూర్యుడు ఉండే ప్రాంతం అంటారు.