Alert : ఈ టైంలో బయటకు రావొద్దు.. వచ్చారా ఎండకు మాడిపోతారు..!

Alert : ఈ టైంలో బయటకు రావొద్దు.. వచ్చారా ఎండకు మాడిపోతారు..!

హెడ్డింగ్ చూసి భయపడుతున్నారా.. ఎస్.. భయపడాలి.. ఎందుకు అంటే భారత వాతావరణ శాఖ అలాగే హెచ్చరించింది. హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే నాలుగు రోజులకు.. అంటే 2024, ఏప్రిల్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వెదర్ అలర్ట్ ఇచ్చింది. 

తెలంగాణలో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు అంటే.. శని, ఆది, సోమ, మంగళవారం వరకు మండే ఎండలు ఉంటాయని హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనం ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం అత్యధికంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని.. సాధారణం కంటే ఇది 5 డిగ్రీలు అధికం అని స్పష్టం చేసింది. సరాసరి 42 డిగ్రీలుగా ఉంటుందని.. అత్యధికంగా 45 డిగ్రీలు ఉంటుందని హెచ్చరించింది. దీనికితోడు వేడి గాలులు కూడా ఉంటాయని.. ప్రజలు ఎవరూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయటకు రాకుండా ఉంటేనే మంచిదని సూచించింది. 

కాదూ.. కూడదు.. ఐ డోంట్ కేర్ అని రోడ్డెక్కితే మాత్రం మాడు పగలటం ఖాయం.. వడ దెబ్బతో అడ్డం పడటం ఖాయం అని హెచ్చరించింది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తక్కువ దూరం అయితే పర్వాలేదని.. దూర ప్రాంత ప్రయాణాలూ మంచిది కాదని సూచించింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రయాణాలు మంచిదని సూచించింది. 

Also Read:45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్

రాబోయే నాలుగు రోజులు అంటే.. ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని రిపోర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కనిష్ఠంగా 26 డిగ్రీలు.. గరిష్ఠంగా 28 డిగ్రీలుగా నమోదు అవుతుందని స్పష్టం చేసింది. అంటే హైదరాబాద్ సిటీలో వర్షాలు పడే సమయంలో.. పగటి ఉష్ణోగ్రత ఎంత నమోదు అవుతుందో.. ఇప్పుడు రాత్రి సమయాల్లో అంత నమోదు అవుతుంది అన్నమాట.. ఈ లెక్కన రాత్రులు కూడా ఉక్కబోత ఖాయం అని స్పష్టం అవుతుంది. 

సో.. హైదరాబాదీలే కాదు.. తెలంగాణ ప్రజలు అందరూ బీ అలర్ట్. రాబోయే నాలుగు రోజులు కాలు బయటపెట్టొద్దు.. కాదని బయటకు వస్తే ఎండ చస్తారు అన్నట్లు రిపోర్టులు చెబుతున్నారు. బీ కేర్ ఫుల్.. బీ అలర్ట్..