- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
- మునుగోడులో కంటి వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
మునుగోడు, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడొద్దని ప్రతి ఒక్కరికి కంటి వైద్యం చేయిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో 11వ విడత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025 జనవరి 19 న మొదలైన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ నిర్విరామంగా కొనసాగుతోందన్నారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించారు.
ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను ఫినిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్వహిస్తోందన్నారు. 11వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడానికి వారం రోజులుగా యువత గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆపరేషన్ అవసరమున్న వారిని హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
