ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి : లెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి : లెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

హుజూర్ నగర్, వెలుగు:  సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో 2160 ఇండ్లకు సంబంధించిన 1,000 లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇందిరమ్మ కాలనీ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...  ఈ నెల రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డి హౌసింగ్ కాలనీ ని ప్రారంభిస్తారు అన్నారు.   ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ,  పీడీ  హర్టికల్చర్ నాగయ్య,ఆర్డీవో శ్రీనివాసులు,ఈఈ మిషన్ భగీరథ కరుణాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,తహసీల్దార్ కవిత  పాల్గొన్నారు.