ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం ధర్నా

ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం ధర్నా

తుంగతుర్తి,  వెలుగు: ఎస్సారెస్పీ నీటిని తమ  పొలాలకు   విడుదల చేయాలని  సూర్యాపేట జిల్లా నాగారం మండల  కేంద్రంలోని జాతీయ రహదారిపై   రైతులు ధర్నా చేశారు.  వారబందీ పద్ధతి లో నీటిని  విడుదల చేస్తామని  చెప్పినా చేయడం లేదని,  పొలాలు   ఎండిపోతున్నాయని ఆగ్రహించారు.  పంట చేతికి వచ్చే సమయంలో నీటిని సకాలంలో విడుదల చేయకుండా  అధికారులు నిర్లక్ష్యం  చేస్తున్నారని,  నేటికీ 12 రోజులు దాటినా  నీటిని విడుదల చేయడం లేదని మండి పడ్డారు.  

ఎస్సై చిరంజీవి వచ్చి  రైతులను శాంతింప చేసి ,  అధికారులతో మాట్లాడి 
నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాలు విరవింప చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు వడ్లకొండ వెంకన్న, నరాల మల్లయ్య, జటంగి కేశవాణి, అంజయ్య ,శ్రీకాంత్, సతీష్ ,విజయ్, పురుషోత్తం, లింగయ్య రమేష్, శ్రీను, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు..