యాదాద్రి, వెలుగు: స్వర్ణగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుప్రభాత సేవ అనంతరం అలంకార ప్రియుడైన స్వామి వారిని స్వర్ణాభరణాలు, పూల మాలలతో అలంకరించి సహస్రనామార్చన సేవ నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి భక్తి శ్రద్దలతో పంచామృతాభిషేకం నిర్వహించారు.
స్వామి వారిని గరుడ వాహనం మీద అధిరోహింప చేసి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కొలనులో సేదదీరిన స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
