- కబడ్డీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కే.రాంరెడ్డి
సూర్యాపేట, వెలుగు: కబడ్డీ క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో ఆటలు ఆడాలని మోడరన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కుంభం రాంరెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట లోని పబ్లిక్ క్లబ్ లో 3వ మోడరన్ కబడ్డీ నేషనల్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ నెల 4 నుంచి 10 వరకు కబడ్డీ క్రీడాకారులకు శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి 60 మంది కబడ్డీ క్రీడాకారులకు కోచింగ్ ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామసాని రమేశ్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. జాతీయ టెక్నికల్ డైరెక్టర్ రాజారావు, ప్రధాన కార్యదర్శి టి.రవికుమార్, మోడరన్ కబడ్డీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ పటేల్ శ్రీధర్ రెడ్డి, ఎం ఎస్ రాజు, తిరుపతి, వీరయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
