ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టు మధ్య చివరిదైన ఐదో టెస్ట్ జరుగుతోంది. ఇప్పటికే యాషెస్ సిరీస్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియాప్రస్తుతం 3-1 ఆధిక్యంలో నిలిచింది. 2025-26 యాషెస్ ముగియక ముందే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ 2027 యాషెస్ కు ఆస్ట్రేలియా స్క్వాడ్ ను ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. 2027లో యాషెస్ కోసం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఈ టూర్ కు పాంటింగ్ ఆదివారం (జనవరి 4) తనకు నచ్చిన 17 మంది ప్రాబబుల్స్ తో జట్టును ప్రకటించాడు. పాంటింగ్ ఆస్ట్రేలియా జట్టుకు కమ్మిన్స్ ను కెప్టెన్ గా ప్రకటించాడు.
ప్రస్తుతం కమ్మిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నాడు. 2027కూడా కమ్మిన్స్ ఉండాలని పాంటింగ్ కోరుకుంటున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న అలెక్స్ కారీని వికెట్ కీపర్ గా కొనసాగించాడు. జోష్ ఇంగ్లిస్ ను బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ గా తన జట్టులో ఉంచాడు. ఫామ్ లో లేకపోయినా మార్నస్ లాబుస్చాగ్నేను తన స్క్వాడ్ లో ఉంచాడు. యంగ్ బ్యాటర్ కాంప్‌బెల్ కెల్లావే, ఫాస్ట్ బౌలర్ ఆలివర్ పీక్ 2027 యాషెస్ లో ఉంటారని అంచనా వేశాడు. దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్ తో పాటు స్పిన్నర్ నాథన్ లియాన్ లను ఎంపిక చేశాడు. జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, జే రిచర్డ్‌సన్ పేసర్లగా పాంటింగ్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.
►ALSO READ | IND vs NZ: ఇంతకంటే బ్యాడ్ లక్ ఉండదు.. గైక్వాడ్‌కు టీమిండియాలో స్థానం దక్కాలంటే అలా జరగాలి
స్పిన్నర్ టాడ్ మర్ఫీని జట్టులో ఉంచాడు.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లుగా బ్యూ వెబ్‌స్టర్, కామెరాన్ గ్రీన్ లను ఎంపిక చేశాడు. ఇంగ్లాండ్ లో జరగబోయే యాషెస్ కు మరో రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే ఆస్ట్రేలియా స్క్వాడ్ ను అంచానా వేయడంతో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ విషయానికి వస్తే మొదటి నాలుగు మ్యాచ్ లు ముగిసేసరికి ఆస్ట్రేలియా సిరీస్ లో 3-1 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం (జనవరి 4) ఐదో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
2027 యాషెస్ కోసం రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), స్కాట్ బోలాండ్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, కాంప్‌బెల్ కెల్లావే, మిచెల్ స్టార్క్, జే రిచర్డ్‌సన్, మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ హాజిల్‌వుడ్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, నాథన్ లియాన్, బ్యూ వెబ్‌స్టర్, ఆలివర్ పీక్
