SRH vs RCB: విరాట్‌కు నచ్చేశాడు: కమ్మిన్స్‌పై కోహ్లీ ప్రశంసలు

SRH vs RCB: విరాట్‌కు నచ్చేశాడు: కమ్మిన్స్‌పై కోహ్లీ ప్రశంసలు

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో బాగా పాపులర్ అవుతున్నాడు. ఆసీస్ జట్టుకు ఒకే ఏడాది యాషెస్, వన్డే వరల్డ్ కప్ తో, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ అందించాడు. ఈ కారణంగానే రూ. 20 కోట్లా భారీ ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 2023 లో జరిగిన మినీ వేలంలో అతన్ని దక్కించుకొని కెప్టెన్ గా చేసింది. అంచనాలకు తగ్గట్లుగానే కమ్మిన్స్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ ల్లో జట్టుకు విజయాలను అందించాడు. నేడు(ఏప్రిల్ 25) ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. 

ఈ మెగా సమరానికి ముందు కమ్మిన్స్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రాక్టీస్ లో భాగంగా కోహ్లీతో సరదాగా ముచ్చటించాడు. ముందుగా కమ్మిన్స్ నేను ఈ వికెట్ ను ఫ్లాట్ గా మారుస్తున్నాను అని అన్నాడు. దీనికి కోహ్లీ నువ్వు చాలా తెలివిగలవాడవి పాటు అంటూ బదులిచ్చాడు. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా కమ్మిన్స్ పిచ్ ఫోటోలు ముందుగానే తీసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత ఇది బాగా వైరల్ గా మారింది. తాజాగా మరోసారి సరదాగా అలాంటి వ్యాఖ్యలే చేయడం అది కూడా కోహ్లీతో కావడంతో చాలా ఫన్నీగా అనిపించింది. 

Also Read:ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు

ప్రస్తుతం కోహ్లీ టోర్నీలో అదరగొడుతున్నాడు. ఆడిన 8 మ్యాచ్ ల్లో 379 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు కమ్మిన్స్ కెప్టెన్ గా, బౌలర్ గా అదరగొడుతున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీ వికెట్ తీసి ఫ్యాన్స్ ను సైలెంట్ చేసిన కమ్మిన్స్.. ఈ సారి కోహ్లీపై ఆధిపత్యం చూపిస్తాడో లేదో చూడాలి.