SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు

SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఇరుజట్లు స్టేడియానికి చేరుకున్నాయి. ఇక, మధ్యాహ్నం నుంచే ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో క్రికెట్ అభిమానుల సందడి నెలకొంది. ఈ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఉప్పల్ స్టేడియం దగ్గరు దాదాపు 2500 మందితో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నా పోలీసులు. ఇక, మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.