రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత

రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత

 తెలంగాణలో రైతు రుణమాఫీపై  సవాల్ ప్రతి సవాల్ నడుస్తోంది. ఆగస్ట్ 15 లోపు రైతు రుణమాఫీ, ఆరుగ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు..తన రాజీనామా లేఖతో అసెంబ్లీ గన్ పార్క్ దగ్గరకు వచ్చారు.  సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామా లేఖతో గన్ పార్క్ దగ్గరకు రావాలని హరీశ్ డిమాండ్ చేశారు. 

హరీశ్ రావు రాకతో  అసెంబ్లీ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున   పోలీసులు భారీగా మోహరించారు. గన్ పార్క్ దగ్గర ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని హెచ్చరించారు. హరీశ్ రావు సవాల్ తో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గన్ పార్క్ దగ్గరకు  భారీగా చేరుకుంటున్నారు. హరీశ్ కు మద్దతుగా మాజీ మంత్రులు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు.