ఓయ్ బిర్యానీ.. మరో క్యాచ్ వదిలేయ్: సైమ్ అయూబ్‌పై ఇండియన్ ఫ్యాన్స్ సెటైర్లు! 

ఓయ్ బిర్యానీ.. మరో క్యాచ్ వదిలేయ్: సైమ్ అయూబ్‌పై ఇండియన్ ఫ్యాన్స్ సెటైర్లు! 

Oye Biryani, Ek Aur Catch Chhodna:  జపాన్‌లోని నిస్షిన్ కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 మెన్స్ క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో మైదానంలో ఆటగాళ్ల పోరు ఎలా ఉందో, స్టాండ్స్‌లో భారత అభిమానుల జోకులు, హంగామా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ ఆల్ రౌండర్ సైమ్ ఆయూబ్ (Saim Ayub) తన పేలవమైన ఫీల్డింగ్‌తో ఇండియన్ అభిమానులకు చక్కటి వినోదాన్ని పంచాడు. అతడ్ని టార్గెట్ చేస్తూ అభిమానులు అరిచిన నినాదాలు, వేసిన సెటైర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఓయ్ బిర్యానీ.. మరో క్యాచ్ వదులేయ్: 

పైనల్ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాడు సైమ్ ఆయూబ్ ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టాండ్స్‌లో ఉన్న భారతీయ అభిమానులు ఆయనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఒక అభిమా గట్టిగా “ఓయ్ బిర్యానీ” అని అరవగా, మరో సపోర్టర్ “ఎక్ ఔర్ క్యాచ్ ఛోడ్ నా” (మరో క్యాచ్ వదులు ) అంటూ సెటైర్లు పేల్చారు. అంతేకాకుండా, “ఛోడేగా భాయ్.. ఛోడేగా.. పాకిస్థాన్ ఛోడేగా” అంటూ కొనసాగిన పాటల రూపంలోని ట్రోలింగ్ స్టేడియాన్ని హోరెత్తించాయి. ఆయూబ్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలను, క్యాచ్‌లు వదిలి పెట్టడాన్ని ఉద్దేశించి ఫ్యాన్స్ చేసిన ఈ హేళన మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.

రోహిత్ శర్మ గార్డెన్ డైలాగ్‌తో కౌంటర్లు: 

ఈ ఫన్నీ ట్రోలింగ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ప్రముఖ మీమ్ కూడా ఉంది. ఫీల్డింగ్ ప్రమాణాలు, ప్లేయర్స్ అలసటను ఎద్దేవా చేస్తూ అభిమానులు “కోయ్ గార్డెన్ మే నహీ గూమేగా” (ఎవరూ మైదానంలోని గార్డెన్‌లో తిరిగినట్లు తిరగకూడదు) అంటూ రోహిత్ శర్మ గతంలో వాడిన వైరల్ డైలాగ్‌తో ఆయూబ్‌ను ఆటపట్టించారు. మైదానంలో ఆటగాళ్ల చురుకుదనం గురించి రోహిత్ చెప్పిన ఈ మాటను ఫ్యాన్స్ పర్ఫెక్ట్‌‌గా వాడుకున్నారు.

క్యాచ్‌లు వదిలి భారీ మూల్యం చెల్లించుకున్న పాక్: 

అభిమానుల జోకులకు తగినట్లే, ఆయూబ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా రెండు కీలక క్యాచ్‌‌లను వదిలి పెట్టాడు. శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్‌‌లను అతడు నేలపాలు చేశాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడం పాకిస్థాన్‌కు శాపంగా మారింది. వచ్చిన లైఫ్ ని చక్కగా సద్వినియోగం చేసుకున్న అభిషేక్ కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి పాక్ బౌలర్లను ఉతికిపారేశాడు. అభిమానుల ట్రోలింగ్‌ మధ్య ఆయూబ్ చేసిన ఈ తప్పిదాలు పాకిస్థాన్‌ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపాయి.