OMG : సిటీలో సిగ్నల్ జంప్ చేసిన కారు.. వేగంగా ఢీకొట్టిన బస్సు.. నుజ్జునుజ్జు..

OMG : సిటీలో సిగ్నల్ జంప్ చేసిన కారు.. వేగంగా ఢీకొట్టిన బస్సు.. నుజ్జునుజ్జు..

ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అన్న సామెత నిజం అయ్యింది ఈ ఘటన చూసిన తర్వాత. అప్పటి వరకు సిగ్నల్ దగ్గర నిక్షేపంగా ఉన్న కారు.. జస్ట్ ఐదు సెకన్ల ముందే సిగ్నల్ జంప్ చేసింది. రైట్ సిగ్నల్ పడకుండానే రైట్ టర్న్ తీసుకున్నాడు ఆ కారు డ్రైవర్.. అంతే నేరుగా వస్తున్న బస్సు.. ఈ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్త కారు నుజ్జు నుజ్జు అయ్యింది. 

ఇది ఎక్కడో హైవేలో జరిగిన ఘటన కాదు.. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ సిటీలో.. నిత్యం బిజీగా ఉండే.. సిటీ నడి బొడ్డున జరిగిన యాక్సిడెంట్. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కారు డ్రైవర్ టర్నింగ్‌లో సిగ్నల్ జంప్ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని వీడియోను చూస్తుంటే తెలిసిపోతుంది.  

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది.   అయితే ఈ ఘటనలో కారులో ఉన్నవారి పరిస్థితి ఎంటో ఇంకా తెలియాల్సి ఉంది.   ఇటీవలే, మలయాళం చిత్ర పరిశ్రమకు చెందిన నటి అరుంధతి నాయర్ మార్చి 14 న కేరళలోని కోవలంలో పెద్ద బైక్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.