Double Ismart: డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్ రెడీ..డీజే మోతకి డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

Double Ismart: డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్ రెడీ..డీజే మోతకి డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double Ismart). రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ అత్యున్నత ప్రమాణాలతో రాబోతున్నట్టు సమాచారం.

మహా శివరాత్రి(మార్చి 8న) సందర్భంగా మూవీని రిలీజ్ చేయనున్నట్లు గతేడాది మేకర్స్ వెల్లడించారు.అప్పట్లో 100 రోజుల కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అంటూ చెప్పుకొచ్చారు.కానీ, టెక్నీకల్ ఇస్యూ వల్ల ఆగిపోయిందని టాక్ వినిపించింది. అయినా ఇప్పటికీ డబుల్ ఇస్మార్ట్ నుంచి కాస్తయినా సౌండ్ మాత్రం వినిపించట్లేదు. దీంతో ఈ సినిమా ఏమైంది? మధ్యలోనే ఆగిపోయిందా ఏంటీ? అంటూ కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం..త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు  మే 15న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట.త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి మ్యూజికల్ హిట్‌గా నిలిచిందో అందరికి తెలిసిందే. ఇస్మార్ట్ కి ఇచ్చిన సౌండ్ తో..సాంగ్స్ లోని మాస్ బీట్స్‌కు డీజె బాక్సులు బద్దలైపోయాయి కూడా.

ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ కోసం బ్యాక్ గ్రౌండ్ సౌండ్ దద్దరిల్లేలా చేయడానికి మ్యూజిక్ వర్క్ లో మణిశర్మ మస్తు బిజీగా ఉన్నారట.
అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా లెవల్లో రానుంది కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగా కొత్త మ్యూజిక్ వినిపించడానికి మణిశర్మ గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
త్వరలో డబుల్ ఇస్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కానుందట. చకచకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయనున్నారట మేకర్స్. ఎట్టి పరిస్థితిలో జూన్ లో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా భారీ అంచనాలున్నాయి. త్వరలో డైరెక్టర్ పూరి ఫైనల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.మరి పూరి-రామ్ పోతినేని కలిసి మరోసారి మాస్ హిస్టీరియా రిపీట్ చేస్తారేమో చూడాలి.