Mrunal Thakur: ఆ హీరోని కొట్టమన్నారు.. భయమేసింది.. మృణాల్ కామెంట్స్ వైరల్

Mrunal Thakur: ఆ హీరోని కొట్టమన్నారు.. భయమేసింది.. మృణాల్ కామెంట్స్ వైరల్

సీతారామం(SitaRamam) సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్డం ను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఈ సినిమా అందించిన విజయంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది ఈ బ్యూటీ. నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న చేసి సూపర్ హిట్ అందుకున్న మృణాల్.. ఇటీవలే విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఇప్పటివరకు మరో సినిమాను ఒకే చేయలేదు ఈ బ్యూటీ. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న ఈ బ్యూటీ తన ఫేవరేట్ హీరో గురించి, ఆహీరోతో ఎదురైనా వింత సంఘటన గురించి చెప్పుకొచ్చింది. మృణాల్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో జర్సీ సినిమా హిందీ రీమేక్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక సీన్ లో మృణాల్ షాహిద్ ని చెంపపై కొట్టాలి. ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడిందట మృణాల్.

కారణం షాహిద్ కపూర్ తన ఫెవరేట్ హీరో కావడమే. అదే విషయాని డైరెక్టర్ కి చెప్పి నేను మెల్లిగా కొడతాను..తరువాత ఫాస్ట్ గా మార్చుకోమని చెప్పిందట. కానీ, దానికి డైరెక్షర్ ఒప్పుకోలేదట గట్టిగా కొట్టమని చెప్పారట. దాంతో భయం భయంగానే ఆ సీన్ చేసిందట మృణాల్. అలా తన ఫెవరేట్ హీరోని కొట్టిన సీన్ గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.