ప్రధానిమోదీకి ఉజ్జెకిస్తాన్అత్యున్న పురస్కారం.. ఇది 36వ అంతర్జాతీయ గౌరవం 

ప్రధానిమోదీకి ఉజ్జెకిస్తాన్అత్యున్న పురస్కారం.. ఇది 36వ అంతర్జాతీయ గౌరవం 

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఉజ్జెకిస్తాన్​అత్యున్నత పురస్కారం ఒలియ్​దరాజాలి దోస్త్లిక్​ను ఆ దేశ అధ్యక్షుడు షౌకత్​ మిర్జియోయెవ్  తాష్కెంట్ లో ప్రధాని మోదీని ప్రదానం చేశారు. ఇప్పటివరకు ప్రధాని మోదీ అందుకున్న 36వ అంతర్జాతీయ పురస్కారం ఇది. 

ఉజ్జెకిస్తాన్​ అత్యున్నత పురస్కారం లభించడం గర్వంగా ఉందన్నారు ప్రధాని మోదీ. దీనిని భారత్, ఉజ్జెకిస్తాన్ మధ్య శాశ్వత బంధానికి అంకితం ఇచ్చారు.ఈ పురస్కారం భారత్​, ఉజ్జెకిస్తాన్ మధ్య బలమైన స్నేహానికి ప్రతీక, ఈపురస్కారం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గుర్తింపు అని ప్రధాని స్పష్టం చేశారు. 

ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా భారత్,ఉజ్జెకిస్తాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి.  భారత్​ కు యురేనియం సరఫరా చేసేందుకు ఉజ్జెకిస్తాన్​ ముందుకు వచ్చింది. దీంతోపాటు రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 5బిలియన్​ డాలర్లకు పెంచాలని రెండు దేశాలు నిర్ణయించాయి.

పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆగస్టు31, సెప్టెంబర్​ 1 తేదీలలో 26వ షాంఘై సహకార సంస్థ(SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశాలు రెండు రోజులపాటు కిర్గిజ్​ స్తాన్​ లో జరగనున్నాయి.