యూనిఫామ్ లేని సైనికులు వాళ్లు: ప్రధాని మోడీ

యూనిఫామ్ లేని సైనికులు వాళ్లు: ప్రధాని మోడీ

డాక్టర్స్, మెడికల్ వర్కర్స్ పై ప్రశంసలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ అదృశ్య మహమ్మారైతే.. దాంతో పోరాడుతున్న డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ అజేయ శక్తి లాంటి వారని ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. ఈ పోరులో మెడికల్ వర్కర్స్ తప్పక విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. మహమ్మారి లేకపోతే ఈ స్పెసల్ డే నాడు మీతో కలసి బెంగళూరులో ఉండటానికి ఇష్టపడతానని మోడీ చెప్పారు.

‘వైరస్ కనిపించని శత్రవు అయ్యుండొచ్చు.. కానీ మన యోధులైన మెడికల్ వర్కర్స్ ను అజేయ శక్తిగా చెప్పొచ్చు. అదృశ్య–అజేయ శక్తుల మధ్య జరుగుతున్న పోరు ఇది. మా వైద్య సిబ్బంది కచ్చితంగా గెలుస్తారు. వైరస్ ను రూట్ లెవల్ నుంచి ఎదుర్కోవడంలో మెడికల్ కమ్యూనిటీతోపాటు కరోనా వారియర్స్ హార్డ్ వర్క్ దాగి ఉంది. డాక్టర్లు, మెడికల్ వర్కర్స్ కూడా సైనికులే.. వారు యూనిఫామ్ లేని సోల్జర్స్. ఇలాంటి సమయంలో ప్రపంచం మొత్తం మన డాక్టర్ లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, సైంటిఫిక్ కమ్యూనిటీ వైపు ఆశగా, కృతజ్ఞతా భావంతో చూస్తోంది. సఫాయి వర్కర్స్, డాక్టర్స్, నర్సులపై హింస, దూషణ, అనాగరిక ప్రవర్తనను ఆమోదించం’ అని మోడీ పేర్కొన్నారు.