ఒడిశా రైలు ప్రమాదం.. ఘటనా స్థలంలో చేతివాటం

 ఒడిశా రైలు ప్రమాదం.. ఘటనా స్థలంలో చేతివాటం

ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో వందలాది మంది కుటుంబాలకు  తీరని ఆవేదన మిగిల్చింది. అయితే ఇంతటి ఘోర విషాదంలోనూ కొందరు చిల్లర వ్యక్తులు  తమ చేతివాటం చూపించారు.   ఘటనా స్థలంలో  పడిపోయిన ప్రయాణికుల పర్సులు తీసుకునే పనిలో పడ్డరు. మరికొందరు చిందరవందరగా పడిపోయాన ప్రయాణికుల కొత్త బట్టలు,  ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు. 

 అయితే  ఘటనా స్థలంలో  చేతివాటంపై వచ్చిన వార్తలను బాలాసోర్ ఎస్పీ సాగరిక నాథ్ ఖండించారు. ప్రమాద స్థలంలో ఎలాంటి వస్తువులు చోరీకి గురైనట్లు వచ్చిన వార్తలలు అవాస్తవమన్నారు.  చోరీ చేసినట్లు తమ దృష్టికి రాలేదన్నారు.  ప్రయాణికుల వస్తువులు కానీ, వారి గుర్తులు చోరీకి గురికాకుండా తగినంత భద్రతా సిబ్బందిని నియమించామని తెలిపారు.   ప్రయాణీకుల వస్తువులను తామ భద్రంగా  ఉంచామని.. మృతులను గుర్తించడానికి  చర్యలు తీసుకుంటామని చెప్పారు.   500 లకు పైగా ఫోన్లను బాధితులకు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.  వీటిలో వంద ఫోన్లు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు.