శ్రీ రంగం ఆలయంలో తప్పిన పెను ప్రమాదం... పెచ్చులూడిన రాజగోపురం

శ్రీ రంగం ఆలయంలో తప్పిన పెను ప్రమాదం...  పెచ్చులూడిన రాజగోపురం

దక్షిణ భారత దేశంలో పవిత్రపుణ్యక్షేత్రం.. శ్రీరంగం రంగనాథుని ఆలయంలో పెనుప్రమాదం తప్పింది. పురాతన కాలంనాటి ఆలయ కట్టడంలో రాజగోపురం దెబ్బతింది. తూర్పుద్వారం రాజగోపురం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మెట్లకు పగుళ్లు రావడంతో అర్ధరాత్రి కుప్పకూలింది. నిత్యంరద్ధీగా ఉండే రంగనాథుని ఆలయ పరిసరాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత రాజగోపురం కుప్పకూలడంలో పెనుప్రమాదం తప్పిందని ఆలయ వర్గాలు అభిప్రాయం వ్యక్తంచేశాయి.

కొద్దిరోజుల క్రితమే ఆలయ తూర్పు ప్రవేశద్వారానికి పగుళ్లు ఏర్పడ్డాయని ఆలయాధికారులు గుర్తించినప్పటికీ.. మరమ్మతుల విషయంలో తాత్సారం చేశారు. దీంతో రాజగోపురం కుప్పకూలిన విషయం తెలుసుకున్న ఆలయాధికారులు త్వరితగతిన శిథిలాలను తొలగించారు.

తమిళనాడులోని శ్రీరంగం నగరంలో ఉన్న శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం, విష్ణువు యొక్క రూపమైన రంగనాథ భగవానుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం.108 వైష్ణవ ఆలయాలలో అగ్రగామిగా భూలోక వైకుంఠంగా  ప్రసిద్ధిచెందిన ..  దివ్య క్షేత్రాల్లో శ్రీరంగం ఒకటి....  ప్రతి రోజు  వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. శ్రీరంగం ఆలయం  క్రీ.పూ 2వ శతాబ్దం నాటిదని, చోళులు దీనిని స్థాపించారని చెబుతారు.

 ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఆలయం ప్రధానంగా 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క కృషి ఫలితంగా ఉంది. శతాబ్దాలుగా చోళులు, పాండ్యులు, హొయసలులు మరియు నాయకులతో సహా వివిధ రాజులు మరియు రాజవంశాలచే ఈ ఆలయం విస్తరించబడింది మరియు పునరుద్ధరించబడింది. ఇంతటి చరిత్ర గలిగిన దేవాలయాన్ని అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇకనైనా దేవాలయాలకు పగుళ్లు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేయాల్సినందిగా భక్తులు కోరుతున్నారు.