జమ్ముకశ్మీర్ లో పుల్వామా తరహా దాడి జరగొచ్చు: నిఘా వర్గాలు

జమ్ముకశ్మీర్ లో పుల్వామా తరహా దాడి జరగొచ్చు: నిఘా వర్గాలు

జమ్ము కశ్మీర్‌లో పుల్వామా తరహా దాడి జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనితో ఏడు రాష్ట్రాలలో హై అలర్ట్‌ ప్రకటించారు. పాకిస్తాన్‌ స్థావరంగా తన కార్యకలాపాలు చేపడుతున్న జైష్‌-ఎ-మొహమ్మద్‌ (JEM) ఉగ్రవాదులు కశ్మీర్‌ లోయలో దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘావర్గాలు తెలిపాయి. దాడులు జరపడానికి ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్‌ నిఘా ఏజెన్సీ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ISI) సహకారం అందిస్తోందని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. నిఘావర్గాల హెచ్చరికలతో ఢిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో హై అలర్ట్‌ ప్రకటించారు ఉన్నతాధికారులు.