ప్రత్యూషకు మహిళా “గ్రాండ్ మాస్టర్” టైటిల్

ప్రత్యూషకు మహిళా “గ్రాండ్ మాస్టర్” టైటిల్

చెస్ ప్లేయర్.. తెలుగు తేజం బి. ప్రత్యూష మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను దక్కించుకుంది. 2325 పాయింట్లకు చేరుకున్న ప్రత్యూష ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇంగ్లాండ్ లో జరిగిన జిబ్రాల్టర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ప్రత్యూష కు తెలుగు రాష్ట్రాల్లో మూడో మహిళా గ్రాండ్ మాస్టర్ నార్మల్ అందుకోవడం ద్వారా ఈ హోదా లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మాత్రమే మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించారు. ప్రత్యూష మూడో మహిళా గ్రాండ్ మాస్టర్ గా స్థానం సంపాదించింది. ఇండియాలో ఈ హోదా ఉన్న ఎనిమిదవ ప్లేయర్ గా ప్రత్యూష కు గుర్తింపు లభించింది. ఇప్పటివరకు ప్రత్యూష చెస్ లో 8 జాతీయ, 24 అంతర్జాతీయ పతకాలను సాధించింది. జిబ్రాల్టర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ప్రత్యూష 25 పాయింట్లు సాధించి 2325 చేరుకోవడంతో మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సొంతం చేసుకుంది.