నేనూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతా

నేనూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతా

ట్రాఫిక్ రూల్సా అవి ఏంటో మాకు తెలియదంటారు కొంతమంది వాహనదారులు. తమ వాహనాలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు. సిగ్నల్ జంపింగ్స్,రోడ్ క్రాసింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇలా ట్రాఫిక్ పోలీసులకు సైతం చుక్కలు చూయిస్తుంటారు. కాని కొత్త  ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి స్పీడ్ కు బ్రేకులేశారు. అయితే ఈ ట్రాఫిక్ రూల్స్ మనుషులే కాదండోయ్ జంతువులు సైతం ఫాలో అవుతున్నాయి. ఓ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ పడింది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ కు అనుగుణంగా వ్యహరిస్తున్నారు. వారి మధ్యలో ఓ ఆవు కూడా ఉంది. ముందు నిర్మానుష్యంగా ఉన్నా ఆవు మాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించింది. ఆవు ట్రాఫిక్ రూల్స్ కు పాటిస్తుంటే ఫిదా అయిన వాహనదారులు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ఆ వీడియోను సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మనుషులు ట్రాఫిక్ రూల్స్ మరిచి పోతుంటే జంతువులు మాత్రం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నాయంటూ ట్వీట్ చేసింది.