ఇన్ స్టా అకౌంట్ డీయాక్టివేట్ చేసిన ప్రియా వారియర్

ఇన్ స్టా అకౌంట్ డీయాక్టివేట్ చేసిన ప్రియా వారియర్

న్యూఢిల్లీ: కన్ను గీటే వీడియోతో యువత హృదయాలను కొల్లగొట్టిన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించింది. ఒరు ఆదార్ లవ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో కాస్త నిరాశ చెందింది. అయితే నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించే బంపర్ చాన్స్ ను దక్కించుకొంది.

తాజాగా ప్రియకు సంబంధించిన ఓ కొత్త అప్ డేట్ ఫ్యాన్స్ కు నిరాశను కలిగిస్తోంది. ప్రియ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసింది. ఇన్ స్టాలో ప్రియ అకౌంట్ కు సుమారు 7.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. వర్చువల్ వరల్డ్ నుంచి విరామం తీసుకుందామనే ఉద్దేశ్యంతోనే ప్రియ ఈ డెసిషన్ తీసుకుంది. ‘అవును, ఆమె మంచి నిర్ణయం తీసుకుంది. స్క్రీన్ టైమ్ నుంచి బ్రేక్ కోసం ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసింది. ఇది తాత్కాలికమే. మళ్లీ తను వాడాలనుకున్నప్పుడు ఇన్ స్టాలో రీజాయిన్ అవుతుంది’ అని ప్రియ తండ్రి ప్రకాశ్ వారియర్ చెప్పారు.