విచారణకు సిద్ధం అంటే.. అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్ళింది ఎవరు..? :మంత్రి పొంగులేటి

విచారణకు సిద్ధం అంటే.. అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్ళింది ఎవరు..? :మంత్రి పొంగులేటి

బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. బుధవారం ( ఏప్రిల్ 8 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని..మేము ఎన్నికల ప్రచారంలో ఉంటే ఇక్కడ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయంటూ మండిపడ్డారు పొంగులేటి. మైనింగ్ అక్రమాలపై ఎంక్వైరీ వేస్తామంటే అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్లిందెవరు అంటూ ప్రశ్నించారు పొంగులేటి.

కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి విపక్షాలు జీర్ణించుకోవట్లేదని... సింగరేణిలో అవకతవకలని ఉప ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.పౌర సరఫరాలో అవినీతి అంటూ మంత్రి ఉత్తమ్ పై మరో పుకారు పుట్టించారని అన్నారు. లిక్కర్ విషయంలో ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి మీద కూడా అదే రకంగా నిందలు వేశారని మండిపడ్డారు.

ALSO READ : త్వరలోనే పాదయాత్ర ప్రారంభిస్తా... 

రాష్ట్రంలో రోడ్లు వేస్తుంటే మంత్రి కోమటిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారని.. క్రషర్లు అంటూ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు పొంగులేటి. హిల్ట్ పాలసీ, మైనింగ్ పై విచారణకు సిద్ధమని సీఎం రేవంత్ చెబితే.. అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్లిందెవరు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి పొంగులేటి. బ్రాడ్ మైండ్ తో హిల్ట్ పాలసీ తెస్తే దానిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.