సీఎం చంద్రబాబును ఉదేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మంగళవారం ( ఏప్రిల్ 8 ) తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు జగన్. త్వరలోనే తన పాదయాత్ర ప్రారంభిస్తానని... పాదయాత్ర స్టార్ట్ అయ్యాక వైసీపీ కార్యకర్తలు ప్రతిరోజూ చంద్రబాబుకు సినిమా చూపిస్తారని అన్నారు జగన్.
ఏపీ రాజధాని గురించి మాట్లాడుతూ... రాజధాని ప్లాన్ A కింద వైజాగ్ అన్నామని.. న్యాయ రాజధానిగా కర్నూలు, అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా చెప్పామని అన్నారు. ప్లాన్ B కింద మావిగన్ అన్నామని అన్నారు. మచిలీపట్నంలో పోర్టు పనులు తమ హయాంలోనే ప్రారంబించామని.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపే రాజధాని గ్రోత్ కారిడార్ గా మావిగన్ ను సూచించామని అన్నారు.
►ALSO READ | శ్రీశైలంలో ఘనంగా భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం..
అమరావతిలో కట్టే బిల్డింగులే మావిగన్ లో కట్టాలన్నామని అన్నారు జగన్. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రూ. 3.52 లక్షల కోట్ల అప్పులు చేసిందని.. తెచ్చిన అప్పు ఎవరి జేబుల్లోకి పోతుందో చెప్పాలని అన్నారు. అమరావతిలో ఖర్చులు బాగా పెరిగాయని.. చదరపు అడుగుకి రూ. 14 వేల కోట్లు అప్పు ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు జగన్. త్వరలోనే పాదయాత్ర ప్రారంభిస్తానని.. ప్రజలతో మమేకం అవుతానని అన్నారు జగన్.
