కొలెస్ట్రాల్ రిపోర్ట్ నార్మల్ వచ్చిందని లైట్ తీసుకుంటున్నారా ? జాగ్రత్త.. దాగివున్న గుండెపోటు ప్రమాదం..

కొలెస్ట్రాల్ రిపోర్ట్ నార్మల్ వచ్చిందని లైట్ తీసుకుంటున్నారా ? జాగ్రత్త.. దాగివున్న గుండెపోటు ప్రమాదం..

చాలా మంది బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్ రిపోర్ట్ నార్మల్ అని వస్తే, గుండె ఆరోగ్యంగా బాగానే ఉందని పండగ చేసుకుంటారు. కానీ, అది నిజం కాకపోవచ్చని ఫోర్టిస్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు. రిపోర్టులు బాగున్నా సరే చాలా మందికి గుండెపోటులు వస్తున్నాయి. ఒకప్పుడు గుండె జబ్బులు అంటే కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. 

ఈ కాలంలో భారతదేశంలో గుండె సంబంధిత మరణాలు 34% పెరిగాయి. గుండెపోటు వచ్చే వారిలో 25% మంది 40 ఏళ్ల లోపు వారే ఉంటున్నారు. అంతేకాదు దాదాపు సగం మంది (50%) 50 ఏళ్ల లోపు వారే.

రిపోర్ట్ నార్మల్ ఉన్నా గుండెపోటు ఎందుకు
మనం సాధారణంగా రిపోర్టులో చెడు కొలెస్ట్రాల్ మాత్రమే చూస్తాం. కానీ గుండె ఆరోగ్యం కేవలం దాని మీద మాత్రమే ఆధారపడి ఉండదు. చాలా మంది భారతీయులలో అథెరోజెనిక్ డిస్లిపిడెమియా అనే సమస్య కనిపిస్తుంది. దీని లక్షణాలు HDL (మంచి కొలెస్ట్రాల్) చాలా తక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, LDL రిపోర్టులో నార్మల్‌గానే కనిపించడం ఉంటాయి.  డాక్టర్ల ప్రకారం.. గుండెపోటు వచ్చిన వారిలో 75% మందికి LDL స్థాయిలు 100 కంటే తక్కువగానే ఉన్నాయి. కాబట్టి, రిపోర్టును చూసి మోసపోవద్దు.

కొలెస్ట్రాల్ కాకుండా ఇతర కారణాలు
కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాదు, గుండెపోటుకు అధిక రక్తపోటు (BP),  షుగర్, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ తినడం, పండ్లు/కూరగాయలు తక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి నేటి కాలంలో యువతలో గుండెపోటుకు ఇది అతిపెద్ద కారణమవుతున్నాయి:

►ALSO READ | బరువు తగ్గటం వల్ల పెరిగిన పొట్ట పోదు.. ఈ 3 ఎక్సర్ సైజులు చేస్తేనే బరువుతోపాటు పొట్ట తగ్గుతుంది..!

కేవలం కొలెస్ట్రాల్ రిపోర్టును చూసి నిర్లక్ష్యంగా ఉండకుండా... రోజుకు కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయండి. మీరు తినే ఆహారంలో పండ్లు, ఆకుకూరలు చేర్చడం పెంచండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. మీ కుటుంబంలో ఎవరికైనా  గుండె జబ్బులు ఉంటే, ముందే డాక్టరును సంప్రదించి లోతైన పరీక్షలు చేయించుకోండి.