బరువు తగ్గటం వల్ల పెరిగిన పొట్ట పోదు.. ఈ 3 ఎక్సర్ సైజులు చేస్తేనే బరువుతోపాటు పొట్ట తగ్గుతుంది..!

బరువు తగ్గటం వల్ల పెరిగిన పొట్ట పోదు.. ఈ 3 ఎక్సర్ సైజులు చేస్తేనే బరువుతోపాటు పొట్ట తగ్గుతుంది..!

చాలామంది బరువు తగ్గితే చాలు, పొట్ట దానంతట అదే తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్  ప్రకారం.. కేవలం బరువు తగ్గడం వల్ల మీ పొట్ట ఫ్లాట్‌గా మారదు. దీనికి అసలు కారణం శరీర నిర్మాణం. మనం బరువు తగ్గినప్పుడు కేవలం కొవ్వు మాత్రమే తగ్గదు, కొన్నిసార్లు కండరాలు కూడా తగ్గిపోతాయి. పొట్ట ఫ్లాట్‌గా కనిపించాలంటే ఈ విషయాలు ముఖ్యం....

*శరీరంలో కండరాల బలం ఉండాలి.
*కూర్చునే, నిలబడే భంగిమ సరిగ్గా ఉండాలి.
కఠినమైన డైటింగ్‌లు చేయడం వల్ల బరువు తగ్గుతారు కానీ, శరీరం ఆకృతికి రాదు. అందుకే సరైన వ్యాయామాలు అవసరం.

పొట్టను తగ్గించే వ్యాయామాలు
*కాళ్లు బలంగా ఉంటేనే శరీరం సరిగ్గా నిలబడుతుంది. కాళ్ల వ్యాయామం చేయడం వల్ల నడుము భాగం టైట్‌గా మారి, పొట్ట తగ్గడానికి సహాయపడుతుంది.
*నేల మీద కూర్చుని కాళ్లు చాపి, చేతులతో పాదాలను తాకుతూ ముందుకు వంగే ఆసనం ఇది. ఇది వీపు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గి పొట్ట ఫ్లాట్‌గా కనిపిస్తుంది.
*మోకాళ్లు, చేతులు నేలపై పెట్టి ఒక చేయి, దానికి వ్యతిరేక దిశలో ఉన్న కాలును చాపి బ్యాలెన్స్ చేసే వ్యాయామం. ఇది వెన్నెముకను, పొట్ట కండరాలను బలంగా చేస్తుంది.

ఈ వ్యాయామాలు చేసిన వెంటనే ఫలితం రాదు. శరీరంలో మార్పులు కనిపించాలంటే కనీసం 3 నెలల పాటు వీటిని క్రమం తప్పకుండా చేయాలి. ఫిట్‌నెస్ అంటే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు.. మన శరీరం ఎంత బలంగా ఉంది, మనం ఎంత నిటారుగా నిలబడుతున్నాం అనేదే ముఖ్యం. బలం పెరిగితే పొట్ట ఆటోమేటిక్‌గా తగ్గుతుంది.