నిరుద్యోగులకు గుడ్ న్యూస్: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 577 ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తులు!

 నిరుద్యోగులకు గుడ్ న్యూస్: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 577 ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తులు!

నార్తర్న్ కోల్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్​సీఎల్) హెచ్ఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ), పారా మెడికల్, ఓవర్‌‌‌‌‌‌‌‌సీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 
 
మొత్తం ఖాళీలు: 577.

విభాగాల వారీగా ఖాళీలు: డంపర్ ఆపరేటర్ (ట్రైనీ) 308, గ్రేడ్ ఆపరేటర్ (ట్రైనీ) 34, డోజర్ ఆపరేటర్ (ట్రైనీ) 52, క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ) 17, పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ) 18, సర్​ఫేస్ మైనర్ ఆపరేటర్ (ట్రైనీ) 43, స్టాఫ్ నర్స్ (ట్రైనీ), టీ &ఎస్ గ్రేడ్– సీ 47, ఫార్మాసిస్ట్ (ట్రైనీ), టీ &ఎస్ గ్రేడ్– సీ 4, టెక్నీషియన్ (పాథలాజికల్) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్– సీ 12, టెక్నీషియన్ (డెంటల్) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్– సీ 2, సైకోథెరపిస్ట్ (ట్రైనీ), టీ &ఎస్ గ్రేడ్– సీ 4, టెక్నీషియన్ (రిఫ్రెక్షన్/ ఆప్టోమెట్రి) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్– సీ 1, టెక్నీషియన్ (రేడియోగ్రాఫర్) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్ –సీ 3, జూనియర్ టెక్నీషియన్ (ఈసీజీ) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్ –సీ 2, ఓవర్ సీర్ (సివిల్) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్– సీ 30. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 9.

లాస్ట్ డేట్: మే 1. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  nclcil.inను సందర్శించండి.