వాటాలు పెంచుకుంటున్న బీఎస్ఈ కంపెనీల ప్రమోటర్లు

వాటాలు పెంచుకుంటున్న బీఎస్ఈ కంపెనీల ప్రమోటర్లు
  • మరిన్ని షేర్లు కొన్న 500 కంపెనీల ప్రమోటర్లు
  • ఈ షేర్లను కొనొచ్చంటున్న నిపుణులు
  • అయితే అన్ని అంశాలను చూడాల్సిందే..

స్టాక్‌ మార్కెట్ ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్లకు అన్నింటి ధరలు తెలుస్తాయ్‌ కానీ విలువ మాత్రం తెలియదని కామన్ స్టాక్స్‌ అండ్‌ అన్ కామన్‌ ప్రాఫిట్స్‌ పుస్తక రచయిత ఫిలిప్‌ ఫిషర్‌ అంటారు.ఇండియా స్టాక్‌ మార్కెట్‌కు ఈ మాటలు చక్కగా వర్తిస్తాయి. ప్రస్తుతం బెంచ్ మార్క్‌ ఇండెక్స్​లు కొత్త శిఖరాలకు చేరుతున్నాయి. ఇండివిడ్యువల్‌  స్టాక్స్‌ మాత్రం చతికిలపడుతున్నాయి. ఈ పరిస్థితిని కొన్ని కంపెనీల ప్రమోటర్లు సొమ్ముచేసుకుం టున్నారు.

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్‌ లో 479 బీఎస్ఈ కంపెనీల ప్రమోటర్లు తన వాటాలను పెంచుకున్నారు. వీరిలో రిలయన్స్‌ , ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌, బజాజ్‌ ఫైనాన్స్‌ , బజాజ్‌ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్‌‌‌‌‌‌‌‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ , బజాజ్‌ ఆటో,జేఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్ యూ స్టీల్‌ , టాటా మోటార్స్‌ , అలహాబాద్‌ బ్యాంక్‌ వంటి దిగ్గజ కంపెనీ ప్రమోటర్లు ఉన్నారు.కంపెనీల ఆర్థిక పరిస్థితిని ప్రమోటర్లు సహజంగానే అద్భుతంగా అంచనా వేయగలుగుతారు.ఇలా వాటాలు పెంచుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రమోటర్ల వాటా పెం పు ఇన్వెస్టర్లకూ మంచిదే! ఎందుకంటే తన సంస్థపై ప్రమోటర్‌ కు మరింత నమ్మకం ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.‘‘ఏ కంపెనీలో అయినా ప్రమోటర్లు వాటాలను పెంచుకుం టే మార్కెట్‌ కు సానుకూల సంకేతాలు వెళ్తాయి. సంబంధిత స్టాక్స్‌ విలువ పెరుగుతుంది. వ్యాపారం భవిష్యత్‌ బాగుంటుందనే నమ్మకంఉంటేనే ప్రమోటర్లు ఎక్కువ వాటాలు కొంటారు’’అని కేఐఎఫ్‌ ఎస్‌‌‌‌‌‌‌‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్‌ రితేశ్‌ అషార్‌ అన్నారు.

పతనమైనప్పటికీ..

ప్రమోటర్లు వాటాలు పెం చుకున్న 479 కంపెనీల్లో65 శాతం కంపెనీల స్టాక్ స్‌ బ్రాడ్‌ బేస్డ్‌ సెల్లిం గ్‌ వల్ల70 శాతం పతనమయ్యాయి. ధరలు తగ్గినప్పటి-కీ ఐడీబీఐ బ్యాంక్‌ , బ్యాంక్‌ ఇండియా, ఫ్యూచర్‌రిటైల్‌ , ఆల్కెమ్‌ లాబ్స్‌ , ఇండియాబుల్స్‌ వెం చర్స్‌ ,బాష్‌ , డాబర్‌ ఇండియా కంపెనీల ప్రమోటర్లుతమ వాటాను పెం చుకున్నారు. హెచ్‌ డీఎఫ్‌ సీబ్యాంక్‌ , ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ, విప్రో, కోలిండియా, ఐఓసీ,ఎన్టీపీసీ, మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌ వంటి 318కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించు-కున్నారు. ‘‘ప్రమోటర్లు వాటాలను తగ్గించుకోవ-డానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సార్లుసదుద్దేశంతోనే వాటాలను అమ్మేయొచ్చు. ఉదా-హరణకు.. కొందరు వాటాలను తగ్గించుకొనికంపెనీకి నిధులు పెరిగేలా చేస్తారు. లిక్వి డిటీసమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తారు. ఈనిధులను వ్యాపార విస్తరణకు వాడుతారు. భవిష్య-త్‌ లో వ్యాపారానికి నష్టాలు వస్తాయని అనుకున్న-ప్పుడు కూడా వాటాలను అమ్మకానికి పెడతారు’’అని 5నైనాన్స్‌ డాట్‌ కా మ్‌ ఫౌండర్‌ దినేశ్‌ రోహిరాఅన్నారు.

మంచి చెడులు ఎంచిన తర్వాతే

ప్రమోటర్లు వాటాలను ఏ ఉద్దేశం కొద్దీతగ్గించుకున్నప్పటికీ అటువంటి షేర్లలోఇన్వెస్ట్‌‌ చేయడానికి ముందు మాత్రం వాటిమంచి చెడులను తప్పకుం డా తెలుసుకోవా-లి. ప్రమోటర్‌ ఉద్దేశం మంచిదనో చెడుదనోనిర్ణయానికి రాకూడదు. అలా చేస్తే తప్పుడునిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుం ది.అయితే ప్రమోటర్‌ వాటా పెరుగుదల ఒకసానుకూల అంశమే అయినా మిగతాకోణాలనూ పరిశీలించడం తప్పనిసరి. క్వా-ర్టర్లీ పలితాలు, కంపెనీ పనితీరు, నిపుణులసూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.‘‘అన్ని అంశాలనూ క్షుణ్నం గా పరిశీలించా-కే పెట్టుబడులపై ఒక నిర్ణయానికి రావాలి.ఆర్ఓసీఈ, ఇబిటా మార్జిన్‌‌, లీవరేజ్రేషియో, క్యాష్‌ ఫ్లో పొజిషన్‌‌, ఫండమెంట-ల్స్‌ వంటి వాటిని చూడటం తప్పనిసరి’’అని రోహిరా వివరించారు