మేం బతుకమ్మ ఆడుకోవద్దా.. మహిళ ఆవేదన

మేం బతుకమ్మ ఆడుకోవద్దా.. మహిళ ఆవేదన

బతుకమ్మ, దసరా పండుగవేళ ఊళ్లకు వెళ్లేందుకు బస్సులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు. సిటీలోని బస్టాండ్లలో బస్సుల్లేక ఇబ్బందిపడుతూ… తీవ్రమైన ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

జేబీఎస్ లో బస్సుల కోసం చూస్తున్న జనం ఇలా స్పందించారు.

ఓ మహిళ V6తో మాట్లాడుతూ ” మేం కామారెడ్డి పోవాలండీ. ప్రైవేటు వాహనాలు నిజామాబాద్, కరీంనగర్ లలో మాత్రమే ఆపుతామంటున్నారు. మధ్యలో ఆపమంటున్నారు. మా ఊళ్లో ఇవాళ్నే సద్దుల బతుకమ్మ. అన్ని ఊళ్లలో రేపు ఉంది. మేం కామారెడ్డి ఎలా పోవాలి. సీఎం ఏమనుకుంటున్నారో మాకైతే తెలుస్తలేదు. అసలు టైమ్ కు ఇలా బస్సులు బంద్ పెట్టుడు ఏమాత్రం న్యాయం కాదు. మేం ఏమీ అడగడం లేదు. మాకు బస్సులు కావాలి. ఒక్కొక్కరంటే ఎలా అయినా వెళ్తాం. పిల్లలను తీసుకుని ఎక్కువ చార్జీలు పెట్టుకుని ఎలా తీసుకెళ్తాం మేం” అని ఆవేదనగా చెప్పింది.

‘ఆర్టీసీ డబుల్ చార్జీ తీసుకున్నా ఓకే గానీ.. వాళ్లు నాలుగింతలు అడుగుతున్నారు. ఎలా పొమ్మంటారు మమ్మల్ని’ అని ఓ మధ్యవయస్కుడు ఆవేదనగా చెప్పాడు.

“ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఎక్కువైతే అలాగే ఉంటుంది. ఏం వాళ్లు పోరా .. వాళ్ల అమ్మగారింటికో.. అత్తగారింటికో వెళ్లరా” అంటూ ఓ యువకుడు గరం అయ్యాడు.

“RTC సమ్మె అని తెలిసినా ప్రభుత్వం చెప్పిన మాటల మీద నమ్మకంతో బస్టాండ్ కు వచ్చినం. ఒకట్రెండు బస్సులైనా నడవక పోతాయా అనుకున్నాం. కానీ.. ఒక్కటి కూడా నడుస్తలేవు. సమస్య పరిష్కారం అవుతుందేమో అనుకుని బస్టాండ్ కు వచ్చినం. కుటుంబం అంతా ఇపుడు ఇబ్బంది పడుతున్నాం ” అని మరో వ్యక్తి చెప్పారు.