IPL 2025 అన్‎క్యాప్డ్ ప్లేయింగ్ XI ప్రకటించిన ఆకాష్ చోప్రా.. టోర్నీ అత్యధిక పరుగుల వీరునికి జట్టులో నో ఛాన్స్..!

IPL 2025 అన్‎క్యాప్డ్ ప్లేయింగ్ XI ప్రకటించిన ఆకాష్ చోప్రా.. టోర్నీ అత్యధిక పరుగుల వీరునికి జట్టులో నో ఛాన్స్..!

న్యూఢిల్లీ: భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా ఒక 15 రోజుల పాటు నిలిచిపోవడం తప్పితే మిగిలిన ఐపీఎల్ 18వ సీజన్ విజయవంతంగా ముగిసింది. క్రికెట్ ప్రియులను దాదాపు రెండున్నర నెలల పాటు ఉర్రూతలూగించిన ఈ సీజన్‎లో ఐపీఎల్‎లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీ జట్టు ఈ ఏడాది విజేతగా నిలిచింది. గుజరాత్‎లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో పంజాబ్‎ను చిత్తు చేసి ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న 18 ఏళ్ల నిరీక్షణకు ఆర్సీబీ తెరదించింది. 

ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో స్టార్ ప్లేయర్లతో పాటు చాలా మంది యంగ్‎స్టర్స్, అన్ క్యాప్డ్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. చిన్న వయసులోనే సీనియర్లకు ధీటుగా పరుగుల చేసి తమ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు. ఏజ్ జస్ట్ ఏ నెంబర్ అని నిరూపించారు. ఇలా చాలా మంది యువ ఆటగాళ్లు ఈ సీజన్లో వెలుగు లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 18వ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆన్ క్యాప్డ్ ప్లేయింగ్ లెవన్ జట్టును కామెంటేటర్ ఆకాష్ చోప్రా ప్రకటించాడు. 

ఈ సీజన్లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్ల తన ప్లేయింగ్ లెవన్ జట్టులో స్థానం కల్పించాడు. అయితే.. ఆకాష్ చోప్రా ప్లేయింగ్ లెవన్‎లో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్‎గా నిల్చిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ పేరు లేకపోవడం షాకింగ్‎కి గురి చేసింది. అంతేకాకుండా సీజన్ మధ్యలో చెన్నై జట్టులో చేరి అదరగొట్టిన యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రేకు కూడా తన ప్లేయింగ్ లెవన్‎లో చోటు కల్పించలేదు ఆకాష్ చోప్రా. 

ఈ ఇద్దరు యువ ప్లేయర్లను చోప్రా తన ప్లేయింగ్ లెవన్‎లో ఎంపిక చేయకపోవడం గమనార్హం. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది సంచలనం సృష్టించిన 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్య వంశీ ఆకాష్ చోప్రా ఆన్ క్యాప్డ్ ప్లేయింగ్ లెవన్‎లో చోటు దక్కించుకున్నాడు. తన జట్టులో వైభవ్‎ను ఫస్ట్ డౌన్ బ్యాటర్‎గా చోప్రా ఎంపిక చేశాడు. ఈ సీజన్లో పంజాబ్ ఫైనల్ చేరడంలో కీ రోల్ ప్లే చేసిన ఆ జట్టు యువ ఓపెనర్స్ ప్రభుస్రిమాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఇద్దరిని తన టీములో సెలెక్ట్ చేశాడు చోప్రా. ఈ ఏడాది రన్నరప్ గా నిల్చిన పంజాబ్ జట్టు నుంచే ఏకంగా ఆరుగురిని సెలెక్ట్ చేశాడు. విజేతగా నిలిచిన ఆర్సీబీ నుంచి కేవలం బౌలర్ యశ్ దయాల్‎కు మాత్రమే తన జట్టులో స్థానం కల్పించాడు.

ఆకాశ్ చోప్రా అన్‌క్యాప్డ్ IPL ప్లేయింగ్ XI: 

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, నమన్ ధీర్, విప్రజ్ నిగమ్, హర్‌ప్రీత్ బ్రార్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైషక్, అన్షుల్ కాంబోజ్