పంజాబ్‌‌లో 424 మందికి భద్రత ఉపసంహరణ

పంజాబ్‌‌లో 424 మందికి భద్రత ఉపసంహరణ

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 424 మందికి భద్రతను ఉపసంహరించుకుంది. సంబంధిత పోలీసులను జలంధర్ కాంట్ లోని ప్రత్యేక డీజీపీకి రిపోర్టు చేయాలని ఆదేశించినట్లు ఓ జాతీయ ఛానెల్ వెల్లడించింది. భద్రత తొలగించబడిన వ్యక్తుల్లో రిటైర్డ్ పోలీసు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నాయకులున్నారు. పంజాబ్ మాజీ డీజీపీ పీసీ డోగ్రా, మజితా ఎమ్మెల్యే గనీవ్ కౌర్, బీజేపీ నాయకుడు జాబితాలో ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో ఆప్ ప్రభుత్వం అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ బాదల్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ తో సహా 8 మందికి భద్రతను ఉపసంహరించుకుంది. ఈ 8 మందిలో ఐదుగురికి Z కేటగిరి ఉండగా.. మిగిలిన ముగ్గురికి Y+ ఉంది. వీరికి 127 మంది పోలీసులు, 9 వాహనాలతో రక్షణ కల్పించే వారు. 

రాష్ట్రంలో వీఐపీల భద్రతను తొలగించడం ఇది మూడో సారి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సహా 184 మందికి భద్రతను ఉపసంహరించుకుంది. మరోవైపు.. అమృత్‌సర్ - కోల్‌కతా ఇంటిగ్రేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ కింద రాజ్‌పురాలోని 5 గ్రామాల్లో రూ.6.66 కోట్ల విలువైన పంచాయతీ భూ పరిహారాన్ని దుర్వినియోగం చేసినందుకు ఇద్దరు సర్పంచ్‌లు, 8 మంది Panches, 2 పంచాయతీ కార్యదర్శులు, ఒక జేఈ  (జూనియర్ ఇంజనీర్), 10 firms, నలుగురు ప్రైవేట్ వ్యక్తులపై విజిలెన్స్ బ్యూరో కేసు నమోదు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను తొలగించి అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. 

మరిన్ని వార్తల కోసం : -
త్వరలో మరో 2 వందే భారత్ రైళ్లు


గుజరాత్‌‌లో మోదీ ఒకరోజు పర్యటన