గుజరాత్‌‌లో మోదీ ఒకరోజు పర్యటన

గుజరాత్‌‌లో మోదీ ఒకరోజు పర్యటన

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లో ఒక రోజు పర్యటించనున్నారు. ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు.. సెమినార్ లో ప్రసంగించనున్నారు. నూతనంగా నిర్మించిన Matushri KDP Multispeciality ఆసుపత్రిని సందర్శిస్తారు. ఈ ఆసుపత్రి ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాజ్ కోట్, గాంధీనగర్ లో కార్యక్రమాలకు తాను హాజరవడం జరుగుతుందని, ఆరోగ్య సంరక్షణ, సహకార సంఘాలు, రైతు సంక్షేమం వంటి కీలక రంగాలకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ ట్వీట్ లో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ లో సహకార్ Sahakar Se Samriddhi పేరిట నిర్వహించే సెమినార్ లో మోడీ ప్రసంగించనున్నారు.

ఈ సదస్సులో వివిధ సంస్థల నుంచి 7 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. అనంతరం గాంధీనగర్ లోని కలోల్ ప్రాంతంలో ఉన్న Nano Urea (Liquid) ప్లాంట్ ను ప్రారంభిస్తారు. నానో యూరియా వాడం ద్వారా పంటల దిగుబడి పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ప్లాంట్ ను స్థాపించారు. ఈ ప్లాంట్ లో రోజుకు 500 మిల్లీమీటర్ల 1.5 లక్షల బాటిళ్లను ఉత్పత్తి జరుగనుంది. మొత్తం దేశానికే గుజరాత్ లోని సహకార రంగం రోల్ మోడల్ గా ఉందని, రాష్ట్రంలో 84 వేల సొసైటీలు ఉన్నాయని PMO పేర్కొంది. దాదాపు 231 లక్షల మంది సభ్యులు ఈ సొసైటీలతో సంబంధం ఉందని తెలిపింది. 
 

మరిన్ని వార్తల కోసం :-

హ్యాట్సాఫ్.. ఐఏఎస్ కీర్తి జల్లి


పెళ్లి మంటపానికి ట్రాక్టర్ నడుపుతూ వచ్చిన వధువు