త్వరలో మరో 2 వందే భారత్ రైళ్లు

త్వరలో మరో 2 వందే భారత్ రైళ్లు

ఈ ఆగస్టు నాటికి మరో 2 వందేభారత్ రైళ్లను తయారు చేసేందుకు చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF) పనులను వేగవంతం చేసింది. ప్రధాని మోడీ  ప్రకటన తర్వాత, ఆగస్ట్'23 నాటికి 75 రైళ్లను మార్చాలని ICF ప్లాన్ చేసింది. మొదటి 2 ప్రోటోటైప్‌లు 15 ఆగస్టు'22లోపు విడుదలవుతాయని ICF జనరల్ మేనేజర్ తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే అధునాతన, సౌకర్యం వంతమైన సదుపాయాలు కొత్త రైళ్లలో ఉంటాయని ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించగా.. దూరపు ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ మార్పులు తెస్తున్నట్టు సమాచారం. 

ఇకపోతే 2021, ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ 75 వారాల్లో 75 ‘వందే భారత్’ రైళ్లు అందాబాటులోకి తెస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా 40 నగరాలను కలుపుతూ 10 సెమీ-హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఈ క్రమంలోనే 2024 నాటికి 100 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని భారత రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా కేంద్ర బడ్జెట్లో... మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో.. ఇప్పుడు ఈ వందే భారత్ రైళ్ల తయారీ ప్రక్రియ అత్యంత వేగంగా పుంజుకుంటోంది.

 

మరిన్ని వార్తల కోసం..

విశ్వవిఖ్యాతకు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు

యూఎన్ లో అమెరికా ప్రతిపాదనను అడ్డుకున్న రష్యా, చైనా