యూఎన్ లో అమెరికా ప్రతిపాదనను అడ్డుకున్న రష్యా, చైనా

యూఎన్ లో అమెరికా ప్రతిపాదనను అడ్డుకున్న రష్యా, చైనా

ఉత్తర కొరియాకు  భారీ ఊరట దక్కింది. ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అమెరికా చేసిన ప్రతిపాదన ఐక్యరాజ్యసమితిలో వీగిపోయింది. ఐరాసలోని 15దేశాల భద్రతామండలిలో అమెరికా చేసిన ఈ తీర్మానాన్ని రష్యా, చైనా విటో చేశాయి. కోవిడ్ తో పోరాడుతున్న ఉత్తర కొరియాకు మానవతా దృక్పథంతో సాయం అందించాల్సింది పోయి ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదని ఆ రెండు దేశాలు వాదించాయి. ఉత్తరకొరియా ఆంక్షల విషయంలో పశ్చిమ దేశాల వైఖరీ ఏకపక్షంగా ఉందని చైనా విమర్శించింది. 

అణు పరీక్ష నిషేధానికి అందరు కట్టుబడేలా చూడాలని కానీ కొన్ని దేశాలపట్ల ఒకవైఖరి, మరికొన్ని దేశాల పట్ల ఇంకో వైఖరి ఎందుకని చైనా రాయబారి జాంగ్ జున్ ప్రశ్నించారు. ఈ సమస్యకు ఆంక్షలు పరిష్కారం కాదని రాజకీయ పరిష్కారమే సరైన మార్గమన్నారు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఉత్తర కొరియాపై అదనపు ఆంక్షలు విధించడం సమస్యకు పరిష్కారం కాదని వాదించారు. 

ఇదిలా ఉంటే ఉత్తర కొరియా ఈ ఏడాది సుమారు 16సార్లు క్షిపణి పరీక్షలు చేసింది. తాజాగా బుధవారం నాడు మూడు క్షిపణులను ప్రయోగించింది. ఈ పరీక్షలపై పొరుగు దేశం దక్షిణ కొరియా సభ జపాన్, అమెరికాలు ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆంక్షల ప్రతిపాదన చేయగా అది వీగిపోయింది.

మరిన్ని వార్తల కోసం

నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ నివాళులు

జిల్లాకే కాదు దేశానికే అంబేద్కర్ పేరు పెట్టాలి