
లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమిత్ షా తో పాటు ఆయన భార్య, కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ఓటు వేశారు .
#WATCH | Union Home Minister Amit Shah casts his vote for the #LokSabhaElections2024 at a polling booth in Ahmedabad, Gujarat
— ANI (@ANI) May 7, 2024
Union HM and senior BJP leader Amit Shah is the party's candidate from the Gandhinagar Lok Sabha seat. Congress has fielded its party secretary Sonal… pic.twitter.com/j6x1p15373
మహారాష్ట్రలోని లాతూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ నటి జెనీలియా. ప్రజాస్వామ్యంలో ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని కోరారు. జెనీలియాతో పాటు తన భర్త దేశ్ ముఖ్ ఓటు వేశారు.
#WATCH | Maharashtra: Actor Riteish Deshmukh and his wife Genelia Deshmukh cast votes at a polling booth in Latur.
— ANI (@ANI) May 7, 2024
NDA has fielded sitting MP Sudhakar Tukaram Shrangare against INDIA Alliance's Kalge Shivaji Bandappa.#LokSabhaElections2024 pic.twitter.com/tP7DLeGjoJ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బారామతిలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. .గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జామ్‌నగర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా పోలింగ్ స్టేషన్ నంబర్ 122, పండిట్ దీనదయాళ్ విద్యా భవన్‌లో ఓటు వేశారు.