
కామారెడ్డిటౌన్ , వెలుగు: ఈ నెల10న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియాంక సభను యూత్ కాంగ్రెస్ శ్రేణులు సక్సెస్ చేయాలని ఆ పార్టీ జిల్లా యూత్ ప్రెసిడెంట్మహమ్మద్ ఇలియాస్ అన్నారు. సోమవారం పార్టీ ఆఫీసులో యూత్ లీడర్ల మీటింగ్ నిర్వహించారు. ప్రియాంక, రేవంత్‌రెడ్డి పాల్గొనే సభ సక్సెస్‌పై చర్చించారు. ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా ఏరియాల నుంచి సభకు పెద్ద ఎత్తున యూత్ తరలించటంపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు.