అసలు పెళ్లి ఆలోచనే లేదు

అసలు పెళ్లి ఆలోచనే లేదు

వరల్డ్ బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు సాధించిన పీవీ సింధు.. దేశానికి ప్రపంచస్థాయిలో మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం త్వరలోనే జరగనున్న టోక్యో ఒలిపింక్స్‌ కోసం సాధన చేస్తోంది. అయితే..పివి సింధు పెళ్లిపై గతంలో అనేక రూమర్స్‌ రాగా.. తాజాగా మళ్లీ ఆమె పెళ్లి గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తన పెళ్లిపై ఎట్టకేలకు సింధు క్లారిటీ ఇచ్చింది. తనకు అసలు పెళ్లి ఆలోచనే లేదని.. ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన దృష్టంతా ఆటపైనే ఉందని, ఒకవేళ పెళ్లి కుదిరితే అందరికీ చెప్పే చేసుకుంటానని చెప్పుకొచ్చింది.