విద్యార్థుల నిరసనపై రాజ్నాథ్ ఆందోళన..విపక్షాల స్వార్థ రాజకీయంపై మండిపాటు

విద్యార్థుల నిరసనపై రాజ్నాథ్ ఆందోళన..విపక్షాల స్వార్థ రాజకీయంపై మండిపాటు

న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను, యువతను వాడుకుంటున్నాయని మండిపడ్డారు. రోడ్లపై రచ్చ చేయడం కాకుండా పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చలకు రావాలని సూచించారు. నీట్​పేపర్ లీకేజీ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలు రెండో నెలకు చేరడం, నల్ల దుస్తులతో విపక్ష నేతలు పార్లమెంట్ ముందు ధర్నా చేయడంపై రాజ్​నాథ్ ఎక్స్​వేదికగా స్పందించారు.

మోదీ సర్కార్ విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. యువత సమస్యలు విని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. విపక్ష నేతలు కృత్రిమ కోపాన్ని నటిస్తూ దేశ యువతను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో చర్చించడం ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ హితవు పలికారు.