- సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని విద్యానగర్ బీసీ భవన్ లో జిల్లాపల్లి అంజి అధ్యక్షతన వివిధ జిల్లాల రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. వడ్లు, మక్కల విక్రయంలో రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. అనంతరం ధాన్యం కుప్పల వద్ద రైతుల పరిస్థితిని వివరిస్తూ కృష్ణయ్య సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. అంచనాలకు మించి వరి పండిందని, కొనుగోలు చేయడంలో అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. . ర్యాగ అరుణ్ కుమార్, నాయకులు రాములు యాదవ్, మోడీ రాందేవ్, నీల వెంకటేశ్ పాల్గొన్నారు.
