రాక్షస రాజ్యాన్ని పాతరేసి..రామరాజ్యాన్ని స్థాపిస్తాం

రాక్షస రాజ్యాన్ని పాతరేసి..రామరాజ్యాన్ని స్థాపిస్తాం

రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని పాతరేసి..రామరాజ్యాన్ని స్థాపిస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో ఆయన పాల్గొన్నారు. హిందూ సమాజ సంఘటితం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని బండి సంజయ్ తెలిపారు. శ్రీ రాముడికి హనుమంతుడి ఎట్లా చేదోడుగా ఉన్నాడో కరీంనగర్ కు ఏ ఆపదొచ్చినా తాను రక్షణ కవచంగా ఉంటానన్నారు. తాను ధర్మం కోసం, కాషాయ జెండా కోసం పనిచేసే వ్యక్తినని చెప్పారు. 

తెలంగాణ గడ్డను కాషాయమయం చేస్తామన్నారు. రాష్ట్రానికి పట్టిన శనిని కాషాయంతో తుడిచి పవిత్రం చేసే బాధ్యతను తీసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. తప్పకుండా రామరాజ్యం తీసుకొస్తామన్నారు. 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టిన దీన స్థితిలో దేశం ఉందన్న ఆయన..ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మసీదులను తవ్వి చూద్దాం..అక్కడ శవాలు బయటపడితే మీరు తీసుకోండి..శివలింగాలు బయటపడితే మాకు అప్పగించండంటూ అసదుద్దీన్ ఓవైసీకి సవాల్ విసిరారు.

మైనారిటీ సంతుష్ట విధానాలతో హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న కుహన లౌకిక వాదులను తరిమికొట్టడమే హిందూ ధర్మ రక్షకుల ప్రధాన కర్తవ్యమన్నారు. లవ్ జిహాదీ పేరుతో అక్కా చెల్లెళ్లను ట్రాప్ చేస్తే ఊరుకుందామా?.. పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మతమార్పిళ్లు చేస్తే ఊరుకుందామా? అని ప్రశ్నించారు. లవ్ జిహాదీ అన్నోడికి లాఠీ రుచి చూపిస్తాం..మతమార్పిళ్లు చేస్తే మక్కెలిరగదీస్తామని హెచ్చరించారు. హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారు..అతి త్వరలో  రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతోందన్నారు బండి సంజయ్. రజాకార్ల ఆకృత్యాలను, హిందూ ఆడపడుచులను ఎట్లా హింసించిర్రో చూపిస్తామన్నారు. దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఇక్కడే మూలాలుంటున్నాయన్న బండి సంజయ్..ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మదర్సాలున్నాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అధికారిక భాషగా ఉన్న ఊర్దును శాశ్వతంగా రద్దు చేస్తామని చెప్పారు. మైనారిటీ రిజర్వేషన్లను పూర్తిగా తుడిచేసి..ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రకులాల పేదలకు వర్తింపజేస్తామన్నారు.

మరిన్ని వార్తల కోసం

రాష్ట్రానికి ష్నైడ‌ర్, స్టాడ్లర్..భారీగా పెట్టుబడులు

బిగ్ హిట్ లేకుండానే పాన్ ఇండియా మూవీస్ కి యాక్షన్, కట్